శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 09:07:53

రోడ్డు ప్రమాదంలో ఒకరు: మృతి ఐదుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు: మృతి ఐదుగురికి గాయాలు

నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండల కేంద్రంలో నార్కట్‌పల్లి అద్దంకి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న హరినాథ్‌ అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  


logo