బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 10:46:26

కారు - స్కూటీ ఢీ : ఒకరు మృతి

కారు - స్కూటీ ఢీ : ఒకరు మృతి

రంగారెడ్డి : మొయినాబాద్‌ మండల పరిధిలోని తొలుకట్ట గేట్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ముషీరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రజాక్‌గా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరూ వికారాబాద్‌ నుంచి ముషీరాబాద్‌కు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. logo