మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 13:13:04

రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదు

రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. కరోనా సోకిన ఐదుగురు వ్యక్తులు ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 150కి చేరుకుంది. కోవిడ్‌-19 కారణంగా దేశంలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. 

14 రాష్ర్టాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు వైరస్‌ విస్తరించింది. తెలంగాణ, మహారాష్ట్ర, గోవాలలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 42 కేసులు, కేరళ-27, ఉత్తరప్రదేశ్‌-16, హర్యాణా-16, కర్ణాటక-11, ఢిల్లీ-10, లద్దాక్‌-8, జమ్ముకశ్మీర్‌-3, తెలంగాణ-6, ఏపీ, గోవాలో ఒక్కో కేసు నమోదైంది. దాదాపు 5,700 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.


logo