మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 13:50:58

హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు

హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో మరో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇటలీ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటలీ నుంచి వచ్చిన మరో ఇద్దరి వ్యక్తులు కూడా కరోనా వైరస్‌ భారిన పడ్డట్లుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ధృవీకరణ కోసం వారి రక్త నమూనాలను పూణేలో గల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించినట్లు పేర్కొన్నారు. జన సమూహా ప్రదేశాలకు ప్రజలు దూరంగా ఉండాల్సిందిగా అధికారులు మరోమారు విజ్ఞప్తి చేశారు.


logo
>>>>>>