బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 17:52:14

ఫ్లెక్సీలు పెట్టినందుకు రూ. లక్ష జరిమానా..

ఫ్లెక్సీలు పెట్టినందుకు రూ. లక్ష జరిమానా..

భద్రాద్రి కొత్తగూడెం:  పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పలు పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. అక్కడ నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం యొక్క అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి పట్టణ ప్రగతి ముఖ్య ఉద్ధేశ్యాన్ని ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తున్నారు. కాగా, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్‌.. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లందు మున్సిపాలిటీలో పర్యటించారు. అక్కడ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించిన ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వేంకటేశ్వర్లకు మంత్రి కేటీఆర్‌ లక్ష రూపాయల జరిమానా విధించారు. జరిమానాను సదరు వ్యక్తి నుంచి వెంటనే వసూలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రప్రభుత్వం పల్లె, పట్టణ అభివృద్ధిపై అత్యంత ప్రాధాన్యత కనబరుస్తోందనీ.. ఇలా ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోతే రేపటి నాటికి.. వాటిని పట్టించుకునే నాథులు లేక చెత్తాచెదారంగా తయారవుతాయని మంత్రి అన్నారు. ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చు.. మున్సిపల్‌ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు.  


logo
>>>>>>