గురువారం 09 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:31:54

పేదల సొంతింటి కల సాకారం

పేదల సొంతింటి కల సాకారం

  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి
  • దసరా నాటికి లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు: మంత్రి వేముల  

కోటగిరి: పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సోంపూర్‌ జీపీ పరిధిలోని రామ్‌గంగానగర్‌లో రూ.2.51 కోట్లతో నిర్మించిన 40 డబుల్‌బెడ్రూం ఇండ్లను, కొల్లూర్‌లో రూ.7.50 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాలును గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాల్లో అన్ని వసతులతో రూ.500 కోట్లతో 5 వేల ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడు తూ.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని, దసరా నాటికి రాష్ట్రంలో లక్ష ఇండ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రామ్‌గంగానగర్‌కు పీఎస్సార్‌ నగర్‌గా నామకరణం చేస్తూ పంచాయతీ చేసిన తీర్మాన ప్రతిని స్పీకర్‌ సమక్షంలో మంత్రికి అందజేశారు.  


logo