గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 19:19:09

బొలెరో వాహనం ఢీకొని ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

బొలెరో వాహనం ఢీకొని ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

మహబూబాబాద్‌: జిల్లాలోని జమండ్లపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లపై వెళ్తున్న నలుగురు వ్యక్తులను వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో దయ్యాల అఖిల్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo