నూరుశాతం గొర్రెల యూనిట్ల పంపిణీ

జగిత్యాల : గొల్ల, కుర్మలకు నెలలోపు డీడీలు కట్టిన వారందరికి నూరుశాతం గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గొల్ల, కుర్మలు కోరిన గొర్రెలను కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు.
ఇందు కోసం సీనియర్ అధికారిని కూడా నియమిస్తామని పేర్కొన్నారు. పంపిణీ చేసిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఏ కారణంచేత గొర్రెలు చనిపోతే వాటి స్థానంలో మరో గొర్రెను అందజేస్తామన్నా. గొల్ల, కుర్మలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకువెల్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.100 సంచార పశువైద్యశాలలు (1962) అంబులెన్స్ లు ఏర్పాటు చేశామని వివరించారు.
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గొల్ల, కుర్మల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేషం గౌడ్, పశు సంవర్దకశాఖ రాష్ట్ర డైరక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ బి.రాజేషం, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో డాక్టర్, లాయర్ మృతి
మినీ మేడారం జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి
హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
చంపేస్తామంటూ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్..!
తాజావార్తలు
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
- అరుదైన మండలి ఎన్నిక నిర్వహణ..! దినపత్రికంత బ్యాలెట్
- మొండి బకాయిలపై లోక్ అదాలత్
- వదలం..కదలం