ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 11:58:26

ఓఆర్ఆర్‌పై ట్రామా కేర్ సెంట‌ర్లు ప్రారంభం

ఓఆర్ఆర్‌పై ట్రామా కేర్ సెంట‌ర్లు ప్రారంభం

హైద‌రాబాద్ : న‌గ‌ర ప‌రిధిలోని ఔట‌ర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ముఖ్య‌మైన ఇంట‌ర్ సెక్ష‌న్ పాయింట్ల వ‌ద్ద 10 బేసిక్ ట్రామా కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. ఇవాళ వ‌ర‌ల్డ్ ట్రామా డే సంద‌ర్భంగా ఈ సెంట‌ర్ల‌ను పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో 160 కిలోమీట‌ర్ల‌ ఓఆర్ఆర్‌పై పూర్తిస్థాయిలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌తి 32 కిలోమీట‌ర్ల దూరానికి ఒక ట్రామా కేర్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంట‌ల పాటు అందుబాటులో ఉండ‌నున్నాయి. ట్రామా కేర్ సెంట‌ర్ల‌తో పాటు అధునాత‌న 10 లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో ట్రామా కేర్ సెంట‌ర్ల‌ను, అంబులెన్స్‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ప‌ట్ట‌ణాభివృద్ధి ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ట్రామా కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన ప్రాంతాలివే.. 

1. శంషాబాద్

2. టీఎస్‌పీఏ

3. ఫైనాన్షియ‌ల్ డిస్ర్టిక్ట్

4. ప‌టాన్ చెరు

5. దుండిగ‌ల్

6. శామీర్‌పేట‌

7. ఘ‌ట్‌కేస‌ర్

8. ఫెద్దఅంబ‌ర్‌పేట‌

9. బొంగులూరు

10. తుక్కుగూడ‌
logo