శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 14:32:10

మూడో రోజు పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

మూడో రోజు పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

జోగులాంబ గద్వాల : తుంగభద్ర పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. రాష్ట సరిహద్దు కావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి అధికంగా భక్తులు తరలివచ్చారు. ఈ మధ్యాహ్నం సమయానికి అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికే 16వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్‌లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. కొవిడ్ వ్యాధి వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమలు చేపడుతున్నారు. సల్ఫర్ క్లోరెడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.