శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:24:15

48 లక్షల ఖాతాల్లో 4,079 కోట్లు

48 లక్షల ఖాతాల్లో 4,079 కోట్లు

  • నాలుగో రోజు 6.41 లక్షల మందికి రైతుబంధు
  • రైతుల ఖాతాల్లో రూ.1,123.78 కోట్లు 

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు సాయం వేగంగా కొనసాగుతున్నది. నాలుగోరోజు 4 ఎకరాల భూమి గల 6.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,123.78 కోట్ల పంటసాయం జమచేశారు. ఇప్పటివరకు 48.75 లక్షల మందికి రైతుబంధు సాయం అందింది. రూ. 4,079.48 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. మూడునాలుగు రోజుల్లో యాసంగి పంటసాయం పంపిణీ పూర్తికానున్నది. యాసంగి సీజన్‌కుగానూ మొత్తం 61.49 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఐదెకరాలలోపు వ్యవసాయభూమి ఉన్నవారు ఎక్కువగా ఉండటంతో మెజార్టీ రైతులకు తొందరగా రైతుబంధు సాయం అందింది. ఇప్పటివరకు 81.59 లక్షల ఎకరాలకు యాసంగి పెట్టుబడి సాయం అందింది.logo