గురువారం 28 మే 2020
Telangana - May 08, 2020 , 01:14:22

కొడుకు సాకుతలేడని..

కొడుకు సాకుతలేడని..

  • ఎల్‌ఎండీలో దూకిన వృద్ధురాలు
  • కాపాడిన లేక్‌ పోలీసులు

కరీంనగర్‌ క్రైం: కొడుకు ఆదరించకపోవడం.. కోడలు వేధించడంతో ఓ వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది కరీంనగర్‌ శివారులోని లోయర్‌ మానేర్‌ డ్యాంలో దూకింది. నీటిలో మునిగిపోతున్న వృద్ధురాలిని లేక్‌పోలీసులు కాపాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నరికుల్ల లచ్చవ్వ(90) భర్త బీసీ హాస్టల్‌లో ఉద్యోగి. ఆయన సర్వీస్‌లో ఉండగానే చనిపోవడంతో కొడుకు కనకయ్యకు ఉద్యోగం వచ్చింది. కొడుకు పట్టించుకోకపోగా, కోడలు నిత్యం వేధించేది. ఆమెకు వచ్చే పింఛన్‌ కూడా ఇవ్వకపోవడంతో లచ్చవ్వ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం వేములవాడ నుంచి కాలినడకన బయలుదేరింది. దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్‌-సిరిసిల్ల బైసాస్‌ వద్ద గల ఎల్‌ఎండీకి గురువారం ఉదయం చేరుకున్నది. డ్యాం నీటిలో దూకగా గొర్రెల కాపరి సమాచారంతో వెంటనే లేక్‌ పోలీసులు వచ్చి ఆ వృద్ధురాలిని కాపాడి  ప్రథమ చికిత్స అందించారు. కొడుకును పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి అతడికి అప్పగించారు. 


logo