ఓల్డ్ మలక్‌పేటలో ప్రారంభమైన రీపోలింగ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమ య్యింది. డివిజన్లో ఈ నెల 1న పోలింగ్ జరిగినప్పటికీ, గుర్తులు తారుమారు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్‌ను వాయిదావేసింది. దీంతో ఇవాళ మరోమారు పోలింగ్ నిర్వహిస్తు న్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ డివిజన్‌తోపాటు గ్రేటర్‌లోని 149 డివిజన్ల ఓట్లను రేపు లెక్కించనున్నారు.
ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 54,655 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27,889 మంది పురుషులు, 26,763 మంది మహిళా ఓటర్లు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. డివిజన్ పరిధిలో మొత్తం 69 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రీపోలింగ్ కోసం 12 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పరిశీలించనున్నారు.
రీపోలింగ్ సందర్భంగా డివిజన్ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా, వ్యాపార, ప్రైవేట్ సంస్థలకు సెలవులు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి