బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 19:24:08

కూకట్‌పల్లి లో "కేక్‌ నేషన్"‌ ను ప్రారంభించిన ఓహ్రీస్‌

కూకట్‌పల్లి లో

హైదరాబాద్‌ః  ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ ఓహ్రీస్‌ గ్రూప్‌ మరో అడుగు ముందుకేసింది. కూకట్‌పల్లి లో ఓహ్రీస్ కు చెందిన కేక్‌ నేషన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. శుక్రవారం కూకట్ పల్లి లో మరొక "కేక్ ‌నేషన్‌" స్టోర్ ను లాంచ్ చేశారు. ఓహ్రీస్‌ తమ కేక్‌ వ్యాపారాన్ని"కేక్‌ నేషన్"  2019లో  ప్రారంభించింది. మొట్టమొదటి  స్టోర్ ను సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కేక్‌ షాప్‌ వ్యాపారాన్నిఇటీవలనే కేక్‌ నేషన్‌గా రీ బ్రాండ్‌ చేశారు. హైదరాబాద్‌ , సికింద్రాబాద్‌ నగరాల వ్యాప్తంగా పలు కేక్‌ నేషన్‌ ఔట్‌లెట్లను తెరువనున్నారు. కేక్‌లను వేడుక చేయడానికి ప్రతిరూపంగా కేక్‌ నేషన్‌ నిలుపాలన్నది లక్ష్యం. అత్యంత ప్రాచుర్యం పొందిన చాక్లెట్‌ ట్రూఫెల్‌, బ్లాక్‌ ఫారెస్ట్‌ , రెడ్‌ వెల్వెట్‌ కేక్స్‌ లాంటి విభిన్నమైన , అద్భుతమైన కేక్‌లతో పాటుగా వినూత్నమైన భారతీయ తియ్యందనాలను స్ఫురింపజేసే కేక్‌లు... రసమలై కేక్‌ ,అప్రికాట్‌ డిలైట్‌ కేక్‌ సైతం ఇక్కడ అందిస్తున్నారు. 

అంతేకాదు మోతీచూర్‌ కేక్‌ , అమర్‌ఖండ్‌ కేక్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు. సాధారణ కేక్‌ ఆఫరింగ్స్‌తో పాటుగా కేక్‌ నేషన్‌ ఇప్పుడు డ్రై కేక్స్‌, గౌర్మెట్‌ కేక్స్‌ ,కస్టమ్‌ డిజైన్‌ కేక్‌లను సైతం అందిస్తుంది. గ్లూటెన్‌ ఫ్రీ అవకాశాలు సైతం ప్రత్యేక ఆర్డర్స్‌పై అందిస్తున్నారు. శాఖాహారులకు సైతం ఇది అత్యుత్తమ అవకాశంగా నిలువనుంది. ఎందుకంటే కేక్‌ నేషన్‌ కేక్‌లన్నీ కూడా ఎగ్‌లెస్‌ కేక్‌లు. కుకీస్‌, పఫ్స్‌, పేస్టరీలు వంటి ఇతర ఉత్పత్తులు సైతం కేక్‌ నేషన్‌లో లభ్యమవుతాయి. అత్యున్నత విలువ కలిగిన కేక్‌లను అందించడానికి కేక్‌ నేషన్‌ ప్రయత్నిస్తుంది. ప్రతిసారీ వినియోగదారులకు సంతోషాన్ని అందించాలన్నది సంస్థ ప్రయత్నం. దీని అసాధారణ కేక్స్‌ పోర్ట్‌ఫోలియోతో, కేక్‌ నేషన్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రాధాన్యతా బ్రాండ్‌గా నిలువడానికి లక్ష్యంగా చేసుకుంది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా అమర్‌ ఓహ్రీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఓహ్రీస్‌ గ్రూప్‌ మాట్లాడుతూ ‘‘సృజనాత్మక కేక్‌లను అందించేలా మా బ్రాండెడ్‌ కేక్‌ షాప్‌ను తెరువాలనేది మా కల. కేక్‌ నేషన్‌ బ్రాండ్‌ ద్వారా , జంట నగర ప్రజలకు విభిన్నమైన రుచులను ఆస్వాదించేలా కేక్స్‌, పేస్టరీలను అందమైన వాతావరణంలో అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేక్‌ నేషన్‌ లక్ష్యం ఎప్పుడూ కూడా అత్యున్నత విలువ కలిగిన  కేక్‌లను అందించడంతో పాటుగా ప్రతి సారీ వినియోగదారులకు ఆనందాన్ని అందించడం. రాబోయే నెలలో, మా పోర్ట్‌ఫోలియో ఆఫరింగ్స్‌ను విస్తరించడంతో పాటుగా మరెన్నో కేక్‌ నేషన్‌ ఔట్‌లెట్లను తెరువనున్నాం’’ అని అన్నారు.

 ఓహ్రీస్‌ ఇప్పుడు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేక్‌ బాక్స్‌లను వినియోగిస్తుంది. ఇవి వినూత్నమైన వే కాకుండా, కేక్‌ ఫ్లేవర్‌కు తగినట్లుగా సృజనాత్మకంగా ఉంటాయి. తమ ఇంటి నుంచి అత్యంత సౌకర్యవంతంగా కేక్‌నేషన్‌ నుంచి తాము కోరుకునే ఉత్పత్తులను హ్యాపీటేక్‌ఎవే డాట్‌ ఇన్‌, స్విగ్గీ , జొమాటో నుంచి ఆర్డర్‌ చేసుకోవచ్చు. స్టోర్  లాంచింగ్ ఆఫర్ లోభాగంగా 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.