మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 19:58:55

అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటాలి

అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటాలి

నల్లగొండ : జిలాల్లోని చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. హరితహారంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. చింతపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద సాగర్ - హైదరాబాద్ రహదారి వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. ఖాళీగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ మొక్కలు నాటాలని ఆదేశించారు. 

అక్కడి నుంచి కొండమల్లేపల్లి మండలంలోనూ పర్యటిస్తూ హరితహారం మొక్కలను పరిశీలించారు. మండల పరిధిలో హరితవనం టార్గెట్ ను పూర్తి చేయాలని సూచించారు. పల్లె ప్రగతి వనాల ఏర్పాటును స్థానిక అధికారులతో సమీక్షించారు. అధికారులంతా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 100 శాతం మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.


logo