శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 12:01:53

శ్రీరామ నవమి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

శ్రీరామ నవమి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జడ్జీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు పోదెం వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీరెడ్డి, ఐటీడీఏ పీఓ గౌతమ్‌, ఏఎస్పీ రాజేశ్‌ చంద్ర పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం, శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలకు హాజరయ్య భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖల వారీగా ఏర్పాటు చేసిన కమిటీలకు విధులపై కార్యాచరణ ప్రణాళిక అందజేశామని దాని ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలని తెలిపారు. ఆలయాల కమిటీ చైర్మన్‌లు, కన్వీనర్లతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. 


logo