శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 14:39:47

వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించిన అధికారులు

వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించిన అధికారులు

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధికి అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్ర ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ హెచ్ఓఏఫ్ శోభ, సీఎం ఆఫీస్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కాలేశ్వరం ఈఎంసీ, ఇతర అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను కావాల్సిన మౌలిక సదుపాయాల విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అటవీ శాఖ భూమి, నర్సరీల నిర్వహణ, మొక్కల ఏర్పాటు తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.