శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 15:19:25

పులి దాడి.. బాలిక కుటుంబానికి అధికారుల పరామర్శ

పులి దాడి.. బాలిక కుటుంబానికి అధికారుల పరామర్శ

కుమురం భీం ఆసిఫాబాద్‌ : జిల్లాలోని పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామంలో పులి దాడిలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని అధికారులు పరామర్శించారు. పులిదాడిలో మృతిచెందిన బాలిక నిర్మల కుటుంబాన్ని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, కవ్వాల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కలిసి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. పులి ఆచూకీ కనుగొనేందుకు కొండపల్లి అటవీప్రాంతంలో అధికారులు పర్యటిస్తున్నారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు.


logo