ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 13:45:58

అధికారులు సమన్వయంతో పని చేయాలి : ఎమ్మెల్యే రామన్న

అధికారులు సమన్వయంతో పని చేయాలి : ఎమ్మెల్యే రామన్న

అదిలాబాద్ : మున్సిపల్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేసి కాలనీల్లో లీకేజీ లేకుండా మంచినీరు సరఫరా చేయాలని.. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ప్రాధాన్య క్రమంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.