మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 29, 2020 , 16:46:04

జంటనగరాల్లోని మటన్‌, చికెన్‌ దుకాణాలపై అధికారుల రైడ్‌

జంటనగరాల్లోని మటన్‌, చికెన్‌ దుకాణాలపై అధికారుల రైడ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని మటన్‌, చికెన్‌ దుకాణాలపై అధికారులు రైడ్‌ చేశారు. బోయిన్‌పల్లి, అస్మత్‌పేట, రాంనగర్‌, కూకట్‌పల్లి, నిజాంపేటలోని దుకాణలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 6 మటన్‌, చికెన్‌ దుకాణాలను అధికారులు జప్తుచేశారు. అస్మత్‌పేటలో స్పెన్షర్‌ మాల్‌లో శీతల వాతావరణంలో నిల్వ చేయకుండా స్టిక్కర్లు వేసి మటన్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ ప్రతిరోజు తేదీ స్టిక్కర్‌ మార్చి మటన్‌ను విక్రయిస్తున్నారు. అదేవిధంగా రాంనగర్‌లో లైసెన్స్‌ లేకుండా నడుపుతున్న మటన్‌ దుకాణాన్ని, నిజాంపేటలో అనుమతి లేకుండా మటన్‌ విక్రయిస్తున్న దుకాణాన్ని అధికారులు జప్తు చేశారు. కిలో మటన్‌ రూ. 700 కంటే ఎక్కువధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


logo