శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 06, 2020 , 01:42:28

వృద్ధురాలికి అభయహస్తం

వృద్ధురాలికి అభయహస్తం

  • ట్వీట్‌కు స్పందించి సమస్య 
  • పరిష్కరించిన మంత్రి కేటీఆర్‌

మునగాల: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు రేషన్‌ కూడా రాక ఇబ్బందులు పడుతున్నదని ట్విట్టర్‌ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ ఆమె సమస్యకు పరిష్కారం చూపారు. సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన పిండిప్రోలు రుక్కమ్మ ఒంటరిగా జీవిస్తున్నదని, రేషన్‌, పింఛన్‌ అందడం లేదని, ఇల్లు కూడా లేదని, సాయంచేయాలంటూ శ్రీకాం త్‌ కృష్ణ అనేవ్యక్తి శనివారం కేటీఆర్‌కు ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశాడు. స్పందించిన మంత్రి సమస్యను వృద్ధురాలిని ఆదుకోవాలని జిల్లా పాలనా అధికారికి అదేశా లు జారీచేశారు. అధికారులు ఆదివారం రుక్కమ్మకు 24కిలోల బియ్యం అందజేశారు. ఆమె కు బియ్యం అందించిన ఫొటోను కేటీఆర్‌ ఆఫీస్‌ నుంచి శ్రీకాంత్‌ కృష్ణకు పోస్ట్‌చేశారు.   

థ్యాంక్స్‌ ప్రేమ్‌జీ

విప్రో కంపెనీ చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీకి మం త్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ర్టానికి రూ.4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందిస్తున్నందుకు థ్యాంక్స్‌ విప్రో.. చైర్మన్‌ ప్రేమ్‌జీ’ అంటూ ట్వీట్‌చేశారు.


logo