ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 18:28:22

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి సారథ్యంలో అధికారుల బృందం ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటించింది. గత మాసంలో కురిసిన వర్షానికి వరి పంట దెబ్బతిన్నది. రైతుల వద్ద  ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట, కరీంనగర్‌, నల్లగొండ, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్ధాయి నివేదిక అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని హాలియా, పెద్దవూర, నిడమనూరు మార్కెట్‌ యార్డులను సందర్శించారు. ధాన్యం రాసులను పరిశీలించారు.  నివర్‌ తుఫాన్‌ కారణంగా గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి తడిసిన, రంగు మారిన ధాన్యం నమూనాను సేకరించి తీసుకెళ్లారు. ఐదు జిల్లాల పర్యాటన అనంతరం అధికారులు క్షేత్రస్థాయి వివరాలు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది.