శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 18:02:28

రైతు వేదిక నిర్మాణ పనుల పరిశీలన

రైతు వేదిక నిర్మాణ పనుల పరిశీలన

సిద్దిపేట : జిల్లాలోని మర్కుక్ మండలం ఎర్రవల్లి, గంగాపూర్-యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికలను జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్ రెడ్డి సోమవారం పరిశీలించారు. రైతువేదిక నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో అధికారులతో మాట్లాడారు. చుట్టూ పచ్చదనం సంతరించుకునే విధంగా మొక్కలు నాటించాలని సూచించారు. పనుల ప్రగతిని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, తహసీల్దార్ ఆరీఫా, పంచాయతీ రాజ్ శాఖ డీఈ ప్రభాకర్, ఏజెన్సీ ప్రతినిధులు బాపినీడు, ఇతరులు పాల్గొన్నారు.logo