శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 20:19:41

రామ‌గుండం వార సంత‌లో ఎన్‌టీపీసీ మాస్కుల పంపిణీ

రామ‌గుండం వార సంత‌లో ఎన్‌టీపీసీ మాస్కుల పంపిణీ

పెద్ద‌ప‌ల్లి : సామాజిక సేవా కార్య‌క్ర‌మం కింద‌ కొవిడ్‌-19పై పోరాటం, అదేవిధంగా జ‌న్ ఆందోళ‌న్‌లో భాగంగా ఎన్‌టీపీసీ రామ‌గుండం సిబ్బంది రామ‌గుండం ఆదివారం సంత‌లో ప్ర‌జ‌ల‌కు మాస్కుల‌ను పంపిణీ చేశారు. 500 మాస్కుల‌ను దుకాణాదారుల‌కు, కొనుగోలుదారుల‌కు పంపిణీ చేశారు. అదేవిధంగా బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు వ‌చ్చిన‌ప్పుడు మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం చేయాల‌ని అవ‌గాహ‌న క‌ల్పించారు. కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్స్ సీనియ‌ర్ మేనేజ‌ర్ స‌హ‌దేవ్ సేతీ, సీఎస్ఆర్ అధికారులు నిషాంత్ తివారీ, యోగేంద‌ర్ రావ్‌, త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.