ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:30

ఎన్టీపీసీలో ఒక్కరోజే 977 మి.యూ. ఉత్పత్తి

ఎన్టీపీసీలో ఒక్కరోజే 977 మి.యూ. ఉత్పత్తి

  • 5 ప్లాంట్లలో 100 శాతం పీఎల్‌ఎఫ్‌
  • గత రికార్డును అధిగమించిన సంస్థ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) సరికొత్త రికార్డును నమోదుచేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ నెల 28న రికార్డుస్థాయిలో 977.07 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. గతంలో 2019 మార్చి 12న అత్యధికంగా ఉత్పత్తి చేసిన 935.46 మిలియన్‌ యూనిట్లు అప్పటికి రికార్డు. తాజాగా మంగళవారం దానిని అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఎన్టీపీసీకి దేశవ్యాప్తంగా 70 విద్యుత్తు ఉత్పత్తి స్టేషన్లు ఉన్నాయి. వీటి పూర్తి సామర్థ్యం 62910 మెగావాట్లు. ఈ ప్లాంట్లన్నింటి ద్వారా మంగళవారం ఒక్కరోజే 977.07 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశారు. ఈ రికార్డులో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, సిపట్‌, లారా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, ఒడిశాలోని తాల్చేర్‌, కనిహా కేంద్రాలు, అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని కోల్దాం హైడ్రోపవర్‌ స్టేషన్లు 100% పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించాయి.logo