బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 12:33:43

కరోనా చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నారై ప్రశంసలు

కరోనా చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నారై ప్రశంసలు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి నగరంలోకి వచ్చే రహదారుల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌తో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎన్నారైలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గత గురువారం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు ఎన్‌ఆర్‌ఐ రోహిత్‌ పోతుకూచి వచ్చారు. ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ రోహిత్‌ సోషల్‌ మీడియాలో సందేశం పంపారు. లండన్‌ నుంచి ఆర్జీఐ ఎయిర్‌పోర్టులో దిగగానే థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. ఆ తర్వాత తన ఇంటి అడ్రస్‌ తెలుసుకుని స్వయంగా జీహెచ్‌ఎంసీ అధికారులు, వైద్య బృందం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం తనకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు తేల్చారు అని రోహిత్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రోహిత్‌ ప్రశంసలు కురిపించారు. 


logo