సోమవారం 25 మే 2020
Telangana - Mar 29, 2020 , 21:03:00

ఇంటింటికి నిత్యావసర సరుకులు పంచిన ఎన్ఆర్ఐ

ఇంటింటికి నిత్యావసర సరుకులు పంచిన ఎన్ఆర్ఐ

హైద‌రాబాద్‌:  కరోనా వైరస్‌ను అరికట్టడం లో భాగంగా, ఇంటి నుండి ఎవ్వరు బయటికి వెళ్లకుండా నిజామాబాదు జిల్లా బోధన్ మండలంలోని  సంగం గ్రామం మొత్తానికి సరిపడే నిత్యావసర సరుకుల్ని ఇంటి ఇంటికి పంచి, తన సొంత ఊరులో ఎవ్వరు ఇబ్బంది పడకుండా  టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు కల్లూరి నరేష్ రెడ్డి పాటుపడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్తుతుల్లో ప్రతీ ఒక్కరు తమని  ఇంతటి వాళ్ళను చేసిన తమ  గ్రామాల  ఋణం తీర్చుకునే సమయమిదనీ, ప్రతీ ఒక్కరు స్పందించాలనీ గ్రామ సర్పంచ్ కల్లూరి గంగా రెడ్డి తెలిపారు.  ఇటువంటి విపత్కర పరిస్థితిలో గ్రామానికి చెందిన వెయ్యి మందిని  ఆదుకున్న కల్లూరి నరేష్ రెడ్డిని, గ్రామ సర్పంచ్ కల్లూరి గంగా రెడ్డిని గ్రామ ప్రజలు, నాయకులు అభినందించారు .logo