గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 10:00:16

ఇక విదేశాల నుంచే ఆన్‌లైన్‌ పూజలు

ఇక విదేశాల నుంచే ఆన్‌లైన్‌ పూజలు

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని ప్రసిద్ధ ఆలయాలకు రాలేని విదేశీ భక్తుల కోసం, విదేశాల నుంచే పూజలు జరిపించాలి అనుకునే వారి కోసం  దేవాదాయశాఖ ఆన్‌లైన్‌ పూజల సౌకర్యం కలపించనుంది. దీనిలో భాగంగా విదేశాల్లో ఉన్న భక్తులకు తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా పూజలు నిర్వహించుకునేందుకు  దేవాదాయశాఖ చర్యలు చేపట్టింది. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇతర ఏ శుభకార్యాన్ని అయినా పురస్కరించుకుని విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు ఇకపై ఆన్‌లైన్‌లో తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహించుకోవచ్చు.

త్వరలోనే భద్రాద్రి, యాదాద్రి, బాసర సరస్వతి, వేములవాడ, తదితర ఆలయాల్లో తమ వారిపేరుమీద పూజలు జరిపించుకునేందుకు వీలుగా దేవాదాయశాఖ ఏర్పట్లు చేస్తుంది. దీంతో పాటు ఈ-హుండీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తేనున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo