మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 15:44:06

ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

 కాళోజీ హెల్త్ యూనివర్సిటీ  :  ప్రైవేట్  మెడికల్  కళాశాల్లో ప్రవేశాలకు అదనపు మాప్ అప్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌ కోటా ఖాళీ సీట్ల భర్తీకి మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 10న సాయింత్రం 4 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఈ  విడుత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొన్నాయి. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov .in వెబ్‌సైట్‌లో  సంప్రదించాలని సూచించాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.