శనివారం 30 మే 2020
Telangana - May 04, 2020 , 19:17:23

పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ అర్బన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. యూనివర్సిటీ పరిదిలోని వైద్య కళాశాలలతో పాటు నిమ్స్ లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాల పరిశీలన ఇప్పటికే పూర్తి అయింది. ఈ నెల 3న  ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. అలాగే కళాశాల వారీగా సీట్ల వివరాలను సోమవారం యూనివర్సిటీ విడుదల చేసింది. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్దేశిత  వెబ్‌సైట్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.


logo