Telangana
- Nov 30, 2020 , 19:06:04
‘ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల’

వరంగల్ అర్బన్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1 ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www .knruhs.telangana.gov.inను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
తాజావార్తలు
MOST READ
TRENDING