ఆదివారం 24 మే 2020
Telangana - Mar 03, 2020 , 01:21:37

టెస్కాబ్‌, మార్క్‌ఫెడ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌

టెస్కాబ్‌, మార్క్‌ఫెడ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌), తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (మార్క్‌ఫెడ్‌) మేనేజింగ్‌ కమి టీ ఎన్నికల కోసం సోమవారం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల ఐదున టెస్కాబ్‌ చై ర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక, 10న మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్ల ఎన్నిక, మరుసటిరోజు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఐదో తేదీ ఉదయం వేళ టెస్కాబ్‌ చైర్మ న్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు నామినేషన్లను స్వీకరించి, 11:30 నుంచి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ చేపడుతారు. అవసరమైతే అదేరోజు మధ్యా హ్నం 3 నుంచి 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. టెస్కాబ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లుగా ఉండే డీసీసీబీ చైర్మన్లు.. టెస్కాబ్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ను ఎన్నుకొంటారు. మార్క్‌ఫెడ్‌ ఎ న్నికలకు ఈ నెల 4న నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడున డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న ఉద యం 8 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్‌, అనంతరం ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. 11న మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ను ఎన్నుకొంటారు.


logo