ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 06:33:33

227 కాంట్రాక్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ భర్తీ

227 కాంట్రాక్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ భర్తీ

హైదరాబాద్‌ : కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర దవాఖానల్లో విధులు నిర్వర్తించేందుకు 227 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న ఎంబీబీఎస్‌ అభ్యర్థులు 27న ఖైరతాబాద్‌లోని ఇంజినీర్స్‌ ఇనిస్టిట్యూట్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించింది. సర్టిఫికెట్లతోపాటు రెండు ఫోటోలు వెంట తెచ్చుకోవాలని పేర్కొంది.  

డిప్యూటేషన్‌ కాల పరిమితి పొడగింపు

డిప్యూటేషన్‌, వర్క్‌ ఆర్డర్స్‌ మీద విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌, నర్సింగ్‌ సిబ్బంది, మినిస్టీరియల్‌ ఉద్యోగుల కాల పరిమతిని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రజారోగ్యం, కుటుంబసంక్షేమం విభాగం శనివారం ఆదేశాలు జారీచేసింది. logo