గురువారం 09 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 19:20:50

‘టిమ్స్‌’లో వైద్యులు, సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌

‘టిమ్స్‌’లో వైద్యులు, సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యులు, సిబ్బంది నియామకానికి వైద్య, ఆరోగ్యసేవల నియామక బోర్డు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో గచ్చిబౌలిలోని టిమ్స్‌ దవాఖానలో బాధితులకు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించి, అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అవసరమైన సిబ్బంది నియామకంపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. ఈ మేరకు దవాఖానలో 499 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా, ఈ నెల 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.


logo