మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 15:45:19

ట్రైడెంట్ చక్కెర కర్మాగారానికి నోటీసులు

ట్రైడెంట్ చక్కెర కర్మాగారానికి నోటీసులు

సంగారెడ్డి : రైతులకు రూ.12 కోట్ల బకాయిలు చెల్లించక పోవడంతో రెవెన్యూ అధికారులు సీరియస్ అయ్యారు. జహీరాబాద్ లోని ట్రైడెంట్ కర్మాగారానికి నోటీసులు జారీ చేశారు. గత ఏడాది రైతులు కర్మాగారానికి చెరుకు సరఫరా చేశారు. ఇందుకు సంస్థ రైతులకు రూ. 12 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా కర్మాగార యజమాన్యం స్పందించలేదు.దీంతో జిల్లా కలెక్టర్ పరిశ్రమల చట్టాన్ని ఉపయోగించి నోటీసులు జారీ చేశారు.  బకాయిలు చెల్లించకపోతే రెవెన్యూ చట్టాన్ని ఉపయోగించి కర్మాగారాన్ని వేలం వేస్తామని హెచ్చరించారు.


logo