సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 21:26:23

సంక‌ల్పం గొప్ప‌దైతే ఆపేదేది లేదు : ఎంపీ సంతోష్ కుమార్‌

సంక‌ల్పం గొప్ప‌దైతే ఆపేదేది లేదు : ఎంపీ సంతోష్ కుమార్‌

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ శ్రీ‌కారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ విదేశాల్లో దిగ్విజ‌యంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సినీ, రాజ‌కీయ‌, పారిశ్రామిక‌వేత్త‌లు, ఉన్న‌తాధికారులు ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలో మొక్క‌ల పెంప‌కానికి ఓ వృద్ధుడు చూపిస్తున్న త‌ప‌న‌ను ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. గుర్గావ్‌లో 91 ఏళ్ల ఓ వృద్ధుడు ప్ర‌తిరోజు తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు లేచి ర‌హ‌దారిపైకి చేరుకుంటాడు. అక్క‌డ‌ ఉన్న డివైడ‌ర్ వ‌ద్దకు చేరుకొని ర‌హ‌దారికి మ‌ద్య‌లో నాటిన మొక్క‌ల‌కు త‌న వెంట తెచ్చిన నీటిని పోస్తుంటాడు.ఇలా ప్ర‌తీరోజు చేస్తుంటాడు. వృద్ధుడి చ‌ర్య‌ను నితిన్ సంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారి వీడియో తీసి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేస్తూ వృద్ధుడికి హృద‌య‌పూర్వ‌క వంద‌నాలు తెలిపారు. మొక్క‌ల‌ను బ్ర‌తికించుకోవాల‌నే వృద్ధుడి తాప‌త్ర‌యంపై ఎంపీ సంతోష్‌కుమార్ స్పందిస్తూ.. అతడిని అభినందించ‌డానికి మాట‌లు లేవ‌న్నారు. త‌న న‌మ‌స్కారాలు తెలియ‌జేస్తున్న‌ట్లు చెప్పారు. మీకు ఆ భ‌గ‌వంతులు మరింత శక్తిని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాసార్ అని అన్నారు. ప్రకృతి పట్ల అభిమానం, ఏదైనా మంచి చేయాలనే సంకల్పం ఉంటే ఏదీ మ‌న‌ల్ని ఆపద‌న్నారు. ఈ చ‌ర్య ద్వారా ఓ ఆశాకిర‌ణాన్ని వెలుగులోకి తెచ్చినందుకు నితిన్ సంగ్వాన్‌కు ఎంపీ ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.