శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 08, 2020 , 18:06:55

క‌రోనాతో తెలంగాణ జాన‌ప‌ద కళాకారుడు మృతి

క‌రోనాతో తెలంగాణ జాన‌ప‌ద కళాకారుడు మృతి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌ఖ్యాత జాన‌ప‌ద క‌ళాకారుడు మ‌హ్మ‌ద్ నిస్సార్ అహ్మ‌ద్ క‌రోనాతో మృతి చెందారు. గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. నిస్సార్ మృతి ప‌ట్ల రాజ్య‌స‌భ స‌భ్యులు జే సంతోష్ కుమార్, ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

నిస్సార్.. తెలంగాణ ప్ర‌జా నాట్య మండ‌లి సెక్ర‌ట‌రీగా, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియ‌న్ రాష్ర్ట కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో నిస్సార్ కీల‌క‌పాత్ర పోషించారు. త‌న పాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేశారు. న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌న్మించిన నిస్సార్.. గ‌త మూడు ద‌శాబ్దాల నుంచి ఆర్టీసీలో ప‌ని చేస్తున్నారు. 


logo