శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 14:27:17

మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా: రాచకొండ సీపీ

మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా: రాచకొండ సీపీ

హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సూచించారు. మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రకటించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన 31 మంది సిబ్బంది కరోనాను జయించి ఈ రోజు విధుల్లో చేరారు. వారిని ఘనంగా సత్కరించిన కమిషనర్‌, కరోనాకు సంబంధించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలన్నారు.


logo