ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 15:35:05

ఇకపై చైనా వస్తువులు అమ్మం : హెచ్‌జీఎంఏ ప్రెసిడెంట్‌

ఇకపై చైనా వస్తువులు అమ్మం : హెచ్‌జీఎంఏ ప్రెసిడెంట్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జనరల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ నిషేదం విధించింది. ఇకపై చైనా వస్తువులు అమ్మబోమని అసోసియేషన్‌ తీర్మానించింది. భారత సైనికులపై చైనా దాడికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు రామ వ్యాస తెలిపారు. అసోసియేషన్‌లో 800 మంది వ్యాపారులు ఉన్నట్లు తామంతా చైనా వస్తువులు విక్రయించొద్దని నిన్న జరిగిన సమావేశంలో తీర్మానం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తమ దుకాణాల్లో ఇకపై చైనా సరుకులను అమ్మమని రామ వ్యాస పేర్కొన్నారు.   ఈ సందర్భంగా చైనాకు చెందిన పలు వస్తువులను వ్యాపారులు ధ్వంసం చేశారు.

గడిచిన సోమ, మంగళవారాల్లో లఢక్‌ తూర్పు ప్రాంతంలోని గల్వాన్‌ నదీ లోయ వద్ద భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన బాహాబాహి ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 76 మంది గాయపడ్డారు. చైనా సైన్యం చర్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థలు ఆ దేశంతో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసుకుంటుండగా మరికొన్ని సంస్థలు రద్దు విషయమై సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు చైనాకు చెందిన వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.logo