గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:46:01

ఇక్కడే కావాల్సినంత పని

ఇక్కడే కావాల్సినంత పని

  • జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటం లేదు
  • రాష్ర్టాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం 
  • టీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీలో కేసీఆర్‌ స్పష్టత 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్తగా జాతీయ పార్టీ పెట్టే ఉద్దేశం కానీ, జాతీయ రాజకీయాల్లోకి పోయే ఆలోచన కానీ తనకు లేవని, ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. జాతీయ పార్టీ పెడుతున్నారని, పార్టీ పేరు ఖరారుచేశారని, ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపారని చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమన్నారు. సోమవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఇలాంటి వార్తలు మనల్ని అయోమయానికి గురిచేయడానికి రాస్తుంటారని, వాటితో గందరగోళపడవద్దని తెలిపారు. రాష్ట్రంలోనే మనకు బోలెడంత పని ఉన్నదని, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఒకవేళ జాతీయ రాజకీయాలకు వెళ్తే.. అందరికీ చెప్పే.. అందరినీ సంప్రదించే నిర్ణయం తీసుకుంటానని స్పష్టంచేశారు. 


logo