మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 12, 2020 , 18:16:53

కొత్తవారికి అనుమానితులకు ఆశ్రయం కల్పించొద్దు...

కొత్తవారికి అనుమానితులకు ఆశ్రయం కల్పించొద్దు...

మహబూబాబాద్‌: కొత్తవారికి, అనుమానితులకు ఆశ్రయం కల్పించకూడదని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలువకుండా ఆశ్రయం కల్పించినా వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా సరిహద్దుల్లోని గ్రామాల్లో స్పెషల్‌ పార్టీ పోలీసులు కూబింగ్‌ నిర్వహిస్తున్నారు. కొత్తగూడ, గంగారాం, బయ్యారం, గూడూరు, మండలాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది.

ఈ నెల 10వ తేదీన కరకగూడెం అటవీ ప్రాంతంలో నీలాద్రి గుట్ట వద్ద మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. ఘటనా స్థలం నుంచి ఏడుగురు మావోయిస్టులు పారిపోయారు. ఘటనా స్థలంలో ఈఐడీలు, కిట్‌ బ్యాగులు, పెన్‌డ్రైవ్‌, సోలర్‌ ప్యానెల్‌, విప్లవ సాహిత్యం, ప్లాస్టిక్‌ షీట్లు స్వాధీనం చేసుకున్నాం. పారిపోయిన మావోయిస్టుల గురించిన సమాచారం అందించి పట్టించిన వారికి తగిన పారితోషకం అందిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరం అందించాలని విజ్ఞప్తి చేశారు. 


logo