మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 13:06:42

కరోనా బాధితుల్లో ఎవరికి సీరియస్‌గా లేదు : మంత్రి ఈటల

కరోనా బాధితుల్లో ఎవరికి సీరియస్‌గా లేదు : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని ఆయన తేల్చిచెప్పారు. కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రయివేటు వైద్య కాలేజీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు.

మొదటి దశలో ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ర్టంలో 22 ప్రయివేటు వైద్య కళాశాలలు ఉన్నాయని, రెండో దశలో వాటిని వాడుకునేందుకు కాలేజీల ప్రతినిధులను కోరామని తెలిపారు. ప్రయివేటు వైద్య కళాశాలల్లోనూ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా చికిత్స అందించేందుకు ప్రయివేటు వైద్య కాలేజీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.

కరోనా బాధితుల కోసం 10 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్న మంత్రి.. 700 ఐసీయూలు, 190 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతానికి కరోనా బాధితుల్లో ఇతరత్రా సమస్యలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడా కరోనా వ్యాప్తి లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వ్యాధి వచ్చిందన్నారు. వారి కుటుంబ సభ్యులకే కరోనా సోకింది అని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. 


logo
>>>>>>