మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 16:55:19

కరోనా సంక్షోభంలోనూ ఆగని సంక్షేమ పథకాలు

కరోనా సంక్షోభంలోనూ ఆగని సంక్షేమ పథకాలు

యాదాద్రి భువనగిరి : కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా కొనసాగుతుండడం హర్షణీయమని  ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు(ఎం) తహసీల్దార్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ను అందిస్తూ పండించిన ధాన్యానికి మద్ధతు ధరను చెల్లిస్తూ రైతులకు అండగా నిలిచారన్నారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఆత్మకూరు(ఎం) మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు నియోజకవర్గంలోనే ఎక్కువ నిధులు మంజూరు చేశామన్నారు. మండలానికి సాగు నీరును అందించేందుకు నిర్మించిన బునాదిగాని కాలువ పనులను త్వరలో పూర్తి చేసి గోదావరి జలాలు అందించే విధంగా ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. త్వరలో రైతుల కళ నెరవేరనుందన్నారు.  కార్యక్రమంలో  ఎంపీపీ తండ మంగమ్మ‌, తహసీల్దార్‌ పి.జ్యోతి, ఎంపీడీవో రాములు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.