గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 15:37:22

సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం : మంత్రి కొప్పుల

సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం : మంత్రి కొప్పుల

పెద్దపల్లి : సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో  మేలు చేస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రంలో 190 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ,షాదీముబారక్ చెక్కులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు వారి తల్లిదండ్రులకు భారం కొవొద్దనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథాకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

కరోనాతో వ్యాపారాలు, పరిశ్రమలు దెబ్బతిని  ప్రభుత్వానికి ఆదాయం పెద్ద మొత్తంలో తగ్గిపోయిందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. 


logo