బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 22:15:50

మంత్రి కేటీఆర్‌ను కలిసిన నామినేటెడ్‌ ఎమ్మెల్సీలు

మంత్రి కేటీఆర్‌ను కలిసిన నామినేటెడ్‌ ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌ : నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వారికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.  కార్య్రక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.