గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:48

సబ్సిడీపై సంచార చేపల విక్రయ వాహనాలు

సబ్సిడీపై సంచార చేపల విక్రయ వాహనాలు

ఇబ్రహీంపట్నంరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మత్స్యఅభివృద్ధి బోర్డు సహకారంతో 150 సంచార చేపల విక్రయ వాహనాలను సబ్సిడీ ద్వారా అందించనున్నదని రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖాధికారి సుకీర్తి గురువారం తెలిపారు. మత్స్యసంపద పెంపునకు కృషిచేస్తున్న ప్రభు త్వం జిల్లాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న నిరుద్యోగ, మహిళాసంఘాలకు, మత్స్య సహకారసంఘాలకు వీటిని అందజేయనున్నట్లు తెలిపారు. రూ.10 లక్షల విలువైన ఈ వాహనాలను 60శాతం సబ్సిడీ, 40 శాతం లబ్ధిదారుల వాటా కింద అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు  ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లోనూ http//www. Fisheries. telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.