మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 06, 2020 , 13:25:21

గాంధీ ఐసోలేషన్‌ నుంచి ఎవరూ పారిపోలేదు: సీఐ బాలగంగిరెడ్డి

గాంధీ ఐసోలేషన్‌ నుంచి ఎవరూ పారిపోలేదు: సీఐ బాలగంగిరెడ్డి

హైదరాబాద్‌: గాంధీ ఐసోలేషన్‌ వార్డు నుంచి ఎవరూ పరారు కాలేదని, హాస్పిటల్‌లోనే ఉన్నాడని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి అన్నారు. బాత్‌రూం అని చెప్పివెళ్లిన బాధితుడు హాస్పిటల్‌లోని మరో వార్డుకి వెళ్లాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్‌ వార్డులోకి పంపించామని ఆయన తెలిపారు. బాధితుడు బాత్‌రూంకి వెళ్లే సమయంలో కనిపించకపోవడంతో తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో బందోబస్తు పకడ్బందీగా ఉన్నదని పేర్కొన్నారు. గద్వాలకు చెందిన కరోనా బాధితుడు గాంధీ ఐసోలేషన్‌ వార్డును పరారయ్యాడని వార్తలొచ్చాయి. అది తప్పుడు వార్తని ఆయన తెలిపారు. 


logo