గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 22:49:55

రాంగ్‌ రూట్‌ వద్దు..ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిద్దాం..

రాంగ్‌ రూట్‌ వద్దు..ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిద్దాం..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ రోడ్లపై వాహనదారుడికి భద్రతపరమైన వాతావరణం కలిగించేందుకు మనమందరం చేతులు కలుపుద్దామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్విటర్‌ వేదిక ద్వారా నగర పౌరులకు పిలుపునిచ్చారు. మన కుటుంబానికి సురక్షితమైన మార్గాలను అందిద్దామన్నారు.  చాలా రోడ్డు ప్రమాదాలు రాంగ్‌ రూటు మార్గంలో ప్రయాణీంచడం కారణంగా చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు.  ప్రత్యేక డ్రైవ్‌లో హైదరాబాద్‌ పోలీసులు రాంగ్‌రూట్‌లో ప్రయాణీస్తున్న 729 మందిని పట్టుకున్నారు. మనమంతా నిబంధనలను పాటించి ఉత్తమ పౌరులమని నిరూపించుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు.logo