బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 14:10:03

మాంద్యం ఉన్నా, కేంద్ర సాయం రాకున్నా ఏ పథకానికి కోత విధించలేదు

మాంద్యం ఉన్నా, కేంద్ర సాయం రాకున్నా ఏ పథకానికి కోత విధించలేదు

హైదరాబాద్‌ : ఆర్థిక మాంద్యం ఉన్నా, కేంద్రం నుంచి ఆర్థికసాయం అంతంతమాత్రంగానే ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పథకానికి ప్రభుత్వం కోత విధించడం గానీ నిలిపివేయడంగానీ చేయలేదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు.  బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆరూరి రమేష్‌ మాట్లాడుతూ... గ్రామాల్లోని ప్రజల సంతోషం గవర్నర్‌ ప్రసంగంలో ప్రతిబింబించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాసులకు న్యాయం జరగలేదన్నారు. ఆసరా పింఛన్‌ లక్షల మంది అభ్యాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. గతంలో నెలకు రూ.200గా ఉన్న పెన్షన్‌ను టీఆర్‌ఎస్‌ హయాంలో రూ.2 వేలకు పెంచామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కళ్లలో ఆనందం చూస్తున్నాం. పేద పిల్లలకు నాణ్యమైన చదువు, సంపూర్ణ భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో వసతులు కల్పించినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయం దండగ అన్నమాట నుంచి వ్యవసాయం పండగ దిశకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకెళ్తోందన్నారు. రైతు బీమాతో పేద రైతులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందుతోందన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో టీఎస్‌ ఐపాస్‌ విజయవంతమైందన్నారు. అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌ మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. 


logo
>>>>>>