శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 11:52:08

తాగునీటి తండ్లాట లేదు : మ‌ంత్రి కేటీఆర్

తాగునీటి తండ్లాట లేదు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ ప‌రిధితో పాటు శివారు ప్రాంతాల్లో కేసీఆర్ సీఎం అయ్యాక వాయువేగంతో తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఒక‌ప్పుడు ఫిబ్ర‌వ‌రి, మార్చి వ‌చ్చిందంటే వంద‌లాది మంది మ‌హిళ‌లు ఖాళీ బిందెల‌తో నిర‌స‌న‌లు చేప‌ట్టేవారు. 14 రోజుల‌కు ఒక‌సారి మంచినీళ్లు వ‌చ్చే దుస్థితి. ఇప్పుడు కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత మంచినీటికి ఇబ్బందులు లేకుండా చేశామ‌న్నారు. రూ. 2 వేల కోట్ల పైచిలుకు ఖ‌ర్చు పెట్టి న‌గ‌ర ప్ర‌జ‌ల‌తో పాటు శివారు ప్రాంతాల‌కు సుర‌క్షిత మంచినీరు అందించామ‌న్నారు.

మ‌హాన‌గ‌రం కోసం గ‌త పాల‌కులు ఏం చేయ‌లేదు. 75 సంవ‌త్స‌రాల్లో ఏ రోజు ఏ ఒక్క మ‌హానుభావుడు, ఏ ఒక్క సీఎం కూడా డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టు గురించి ఆలోచించ‌లేదు. 1916లో ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయాత్ సాగ‌ర్ క‌ట్టారు. 1920లో గండీపేట‌, మ‌ళ్లీ వందేళ్ల త‌ర్వాత 2020లో కేశావ‌పురం రిజ‌ర్వాయ‌ర్ క‌డుతున్నాం. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలిసిన నాయ‌కుడు కాబ‌ట్టే ఇప్పుడు తాగునీటి తండ్లాట లేదు. 90 శాతం తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక వాయువేగంతో తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని కేటీఆర్ తెలిపారు.